ఏపీలో సెంచరీ కొట్టిన పెట్రోల్….

68
Petrol Price

వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో సెంచరీ మార్క్ దాటగా తాజాగా ఏపీలో సెంచరి కోట్టింది.

పెట్రోలుపై లీటరుకు 17 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరగడంతో చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆదివారం లీటరు పెట్రోల్‌ ధర రూ.100.30కు చేరింది. మిగిలిన జిల్లాల్లో వందకు రూపాయి నుంచి 50పైసలు మాత్రమే తక్కువగా ఉంది.

నెల్లూరులో లీటరు పెట్రోలు ధర రూ.99.71, ఏలూరులో రూ.99.64, కర్నూలులో రూ.99.71, మచిలీపట్నంలో రూ.99.63, కాకినాడలో రూ.99.57 విజయవాడలో ధర రూ.99.41గా ఉంది. ఎన్నికల తర్వాత వరుసగా చమురు ధరలు పెరగడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.