ఆమె పై ట్రోలింగ్.. అవసరమా ?

71
- Advertisement -

సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేసేందుకే ఎప్పుడూ భారీగానే ఉంటారు నెటిజన్లు. ఎలాగూ భావ‌వ్య‌క్తీక‌ర‌ణ‌కు స్వేచ్ఛ ఉంది కదా అని.. త‌మ‌కు న‌చ్చ‌ని అంశాల విష‌యంలో ట్రోల్ పేరుతో రాక్ష‌సానందాన్ని చాటుకునే నెటిజన్లకు కొదవే లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ లో త‌మ‌కు న‌చ్చ‌ని అంశంపై విప‌రీత స్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అందులో భాగంగా తాజాగా సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ పై కోలీవుడ్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ కాబట్టి.. రమ్యకృష్ణ ఏభై పదుల వయసులోనూ అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తోంది.

ఈ క్రమంలో తన లేటెస్ట్ బోల్డ్ స్టిల్స్ ను రమ్యకృష్ణ తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజ‌న్లు ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆమె రెడ్ కలర్ డ్ర‌స్ లో బోల్డ్ గా కనిపించే సరికి.. వెంటనే రమ్యకృష్ణ పై బాడీ షేమింగ్ కు పాల్ప‌డుతున్నారు నెటిజ‌న్లు. ఈ డ్ర‌స్ లో రమ్యకృష్ణ ఏమీ ఎబ్బెట్టుగా లేదు. అలాగే మరీ బోల్డ్ గా కూడా ఏమీ లేదు. కాకపోతే, స్లీవ్ లెస్ డ్రెస్ కావడంతో ఒకవైపు కాస్త క్లీవేజ్ షో కనిపిస్తోంది. అంతే.. ఈ వయసులోనూ ఇలాంటి ఎక్స్ పోజింగ్ ఫోటోలు అవసరమా ?, ఇక నుంచైనా కాస్త మీ పద్దతి మార్చండి’ అంటూ నెటిజన్లు సలహాలు ఇస్తూ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు.

సలహా అయినా సరే.. ఒక నటికి ఎలా ఉండాలి అని చెప్పే రైట్ కచ్చితంగా నెటిజన్లకు లేదు. కాబట్టి, ఈ మాజీ హీరోయిన్ పై ఇలా అనుచితమైన రీతిలో ట్రోల్ కు దిగడం కచ్చితంగా మంచి పద్దతి కాదు. అయినా ఈ ట్రోల్స్ చేసేవారంతా ఎప్పుడు ఖాళీగా ఉంటారా ? ఏమిటి ?, ఎప్పుడు ఎవరు దొరుకుతారా ? అని ఎదురు చూస్తారా ?. కేవ‌లం రమ్యకృష్ణ అనే కాదు, చాలా మంది విష‌యంలో బాడీ షేమింగ్, మోర‌ల్ పోలిసింగ్.. తో రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -