చేనేతపై జీఎస్టీ…పోస్టు కార్డు ఉద్యమం

318
Minister KTR
- Advertisement -

చేనేత కార్మికులకు అండగా పోస్ట్ కార్డ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు మంత్రి కేటీఆర్. చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా విధించిన ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ప్రధాని మోడీకి లక్షలాదిగా పోస్టు కార్డులు రాయాలని పిలుపునిచ్చారు #RollbackHandloomGST అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు.

నేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్, తన స్వహస్తాలతో రాసిన ఈ పోస్ట్ కార్డును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు.

దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనే అన్నారు. ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్బర్ భారత్, గాంధీ మహాత్ముని సూత్రాలను వల్లే వేసే కేంద్ర ప్రభుత్వం… తన విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందన్నారు.

- Advertisement -