ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించడంపై హిట్ మ్యాన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఏంటని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ కు ట్విట్టర్ లో 13.3 లక్షల ఫాలోవర్స్ ఉండగా.. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన తరువాత ఆ సంఖ్య 12.5 కు పడిపోయింది. దీన్ని బట్టి హిట్ మ్యాన్ అభిమానులు ముంబై యజమాన్యం పై ఏ రేంజ్ లో ఫైర్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే రోహిత్ కు కెప్టెన్సీ దూరం కావడంతో అతడు ముంబై జట్టు ను విడిచిపెట్టే అవకాశం ఉందనే టాక్ క్రీడా వర్గాల్లో వినిపిస్తోంది..
ఇప్పటికే వేలం ముగిసిపోయినప్పటికి సన్ రైజర్స్ హైదరబాద్, డిల్లీ క్యాపిటల్స్ .. రోహిత్ శర్మ ను తమ జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. డిల్లీ క్యాపిటల్స్ ఆల్రెడీ ముంబై ఇండియన్స్ యజమాన్యాన్ని కూడా సంప్రదించినట్లు సమాచారం. అయితే రోహిత్ తో ఉన్న కాంట్రాక్ట్ ఇంకా పూర్తి కానందున హిట్ మ్యాన్ ను వదులుకునేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్సీ నుంచి వైదొలగినప్పటికి రోహిత్ శర్మ ఆటగాడిగా ముంబై జట్టులోనే కొనసాగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో పెద్ద ఆశ్చర్యం లేదని సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్ లో ఒత్తిడి తగ్గించుకుని ఆటను ఆస్వాదించేందుకే రోహిత్ కెప్టెన్సీ వదులుకొని ఉండొచ్చు అంటూ డివిలియర్స్ చెప్పుకొచ్చారు. మొత్తానికి రోహిత్ కెప్టెన్సీ తొలగించడం ముంబై ఇండియన్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read:Harishrao:ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన కాంగ్రెస్