టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా టీమిండియా టీ20, వన్డే, టెస్ట్.. ఇలా ఫార్మాట్ ఏదైనా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేస్తోంది. టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక టెస్టు ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. జట్టులోని ఆటగాళ్లు సైతం ఆయా విభాగాల్లో నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు. ఎప్పుడు లేని విధంగా టీమిండియా ఇలాంటి అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రధాన కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ రోహిత్ పై విమర్శలు వస్తూనే ఉంటాయి. టెస్టుల్లో రోహిత్ ప్రదర్శన పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జాఫ్రీ బాయ్కాట్ ఘాటు విమర్శలు చేశాడు.
రోహిత్ వయసు 36 ఏళ్ళు దాటిందని అతడు అత్యుత్తమ ఫామ్ దశను కోల్పోయాడంటూ కామెంట్స్ చేశాడు. అరకొరగా పరుగుల సాధిస్తున్నప్పటికీ గత కొన్ని మ్యాచ్ లను గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుందని జాఫ్రీ బాయ్కాట్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్ట్ లో ఓటమి చవిచూసిన టీమిండియా రెండో టెస్టులో విజయం కోసం ఆరాటపడుతోంది. రెండో టెస్టులో గెలవడం టీమిండియా కు ఎంతో ముఖ్యం. ఇప్పటికే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయిన రోహిత్ సేన తిరిగి మొదటి స్థానం చేరుకోవాలంటే రెండో టెస్టు మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండో టెస్టులో కూడా ఓటమి చెవి చూస్తే రోహిత్ కెప్టెన్సీ పై మరిన్ని విమర్శలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. మరి రెండో టెస్టులో రోహిత్ శర్మ తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.
Also Read:అదృష్టమంటే ఈ కుమారి దే..