అదృష్టమంటే ఈ కుమారి దే..

17
- Advertisement -

అదృష్టమంటే ఈ కుమారి మెస్ దే … మొన్నటి వరకు కొంత మందికి పరిచయం మరిప్పుడు నెటిజన్ల ఒత్తిడి తో , మీడియా సహకారం తో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మల్లి మెస్ నడిపే అవకాశం వచ్చింది .. ఇప్పుడున్న భోజనప్రియుల తాకిడికి పొలీస్ బందోబస్తు తో నడపాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈమె పేరు దాసరి కుమా. దుర్గం చెరువు సమీపంలోని కోహినూర్ ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర రోడ్ సైడ్ హోటల్ నడుపుతోంది. రూ.120 కే మూడు నాన్ వెజ్ కర్రీస్ తో భోజనం దొరుకుతుంది అక్కడ . ఎప్పుడూ రద్దీగా ఉండే హోటల్ వల్ల ట్రాఫిక్ ఇబ్బుందులు వస్తున్నాయని పోలీసులు నిన్న మూసేయించారు. కుమారి హోటల్ క్లోజ్ చేశారని యూట్యూబ్ న్యూస్ ద్వారా తెలుసుకున్న ఫుడ్ ఫాన్స్ నిన్న ఈవెనింగ్ అక్కడకు చేరుకుని మళ్ళీ తెరిపించాలని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెట్టారు.

అవి కాస్త వైరల్ అయి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లాయి. వెంటానే ఓపెన్ చేయించాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి . సీఎం గారు త్వరలో కుమారి గారి రెస్టారెంట్ ను సందర్శిస్తారని సీఎంఓ వెల్లడించడంతో ఫుడ్ లవర్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 2-3 వేల మంది భోజనానికి బారులు తీరడంతో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కృష్ణా జిల్లాకు కు చెందిన దాసరి కుమారి గారి కుటుంబం 13 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి హోటల్ నడుపుతోంది.

Also Read:పుట్టగొడుగులు తింటున్నారా!

- Advertisement -