రోహిత్ గేమ్ ప్లాన్ షురూ..!

153
rohith
- Advertisement -

టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక కోహ్లీ వారసుడిగా రోహిత్ శర్మ ఎంపికవ్వగా ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను గెల్చుకుని సత్తాచాటాడు రోహిత్. ఇక 2022లో టీ20 వరల్డ్ కప్ గేమ్ ప్లాన్‌ని షూరూ చేశాడు రోహిత్. రాబోవు రెండేళ్లలో టీ20 వరల్డ్‌కప్, వన్డే ప్రపంచకప్ జరగబోతుండటంతో కొత్త సవాళ్లకి సిద్ధంగా ఉండాలని మిడిలార్డర్‌కి రోహిత్ శర్మ సూచించాడు.

మెగా టోర్నీల్లో ఒకవేళ భారత్ జట్టు 10 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంటే? ఆ పరిస్థితుల నుంచి జట్టుని గట్టించేందుకు మిడిలార్డర్ సిద్ధంగా ఉండాలి. మరీ ముఖ్యంగా.. 3 నుంచి 6 స్థానాల్లో బ్యాటింగ్ చేసేవారు రెడీగా ఉండాలని తెలిపాడు. 10/3 స్థితి నుంచి జట్టు 190 పరుగులు చేయడం సాధ్యంకాదని ఎక్కడా రాసిలేదు కదా? అలానే ఫస్ట్ రెండు ఓవర్లలోనే టీమ్ 10/2తో నిలిచినప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది క్లారిటీ ఉండాలని తెలిపాడు. టీమ్‌లో సమర్థులైన ఆటగాళ్లకి ప్రాధాన్యత ఉంటుందని… కోహ్లీ నాణ్యమైన బ్యాట్స్‌మెన్ తన అనుభవంతో ఎన్నోసార్లు టీమ్‌ని గట్టెక్కించాడని గుర్తు చేశాడు రోహిత్.

- Advertisement -