బిగ్ బాస్ 5…షణ్ముఖ్‌తో ఓపెన్ అయిన సిరి!

37
siri

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 96 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 96వ ఎపిసోడ్‌లో భాగంగా సిరి- షణ్ముఖ్ రొమాన్స్‌ పరిధి దాటిపోయింది. షణ్ముఖ్ అంటే ఇష్టమని చెప్పేసి హగ్‌లో తడిసి ముద్దచేసింది సిరి. తర్వాత మానస్ పవన్ కళ్యాణ్,సన్నీ బాలయ్య.. శ్రీరామ్ చిరంజీవి.. షణ్ముఖ్ సూర్య.. కాజల్‌ని దేవిగా సిరిని జెలీనియాతో పోల్చి బిగ్ బాస్ పాటలు ఇచ్చినప్పుడల్లా డ్యాన్స్ చేయాలని ఎవరు బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తే.. వాళ్లు ప్రేక్షకుల్ని ఓట్లు అడుక్కోవచ్చని తెలిపాడు బిగ్ బాస్.
తొలుత జెనిలియాగా యాక్ట్ చేస్తున్న సిరికి జెలినియా సాంగ్ వేశారు. ఆమెకు తోడుగా సన్నీ కలిసి స్టెప్‌లు వేశాడు. సిరి స్టెప్‌లతో ఇరగదీసింది. ఇంట్లో ఉన్న వాళ్లంతా సాంగ్‌ని ఎంజాయ్ చేస్తుంటే.. షణ్ముఖ్ ముఖం మాడ్చుకుని పక్కన కూర్చున్నాడు. ఒకవేళ అమ్మాయి సాంగ్ వస్తే.. కాజల్‌తో వేస్తావా? అని సిరి అడిగ్గా.. కాజల్‌కి స్టెప్స్ రావుగా మనిద్దరం వేద్దాంలే అని అంటాడు షణ్ముఖ్.

గబ్బర్ సింగ్ పాట వేసినా.. సిరి స్టేజ్ మీదికి వెళ్లకుండా అక్కడే ఆగిపోయింది. మొత్తానికి సిరిని మాటలతోనే కాదు.. మాటలు.. పాటలతో కూడా కంట్రోల్ చేశాడు షణ్ముఖ్. నీకు దూరంగా ఉండలేకపోతున్నా.. ట్రిప్ కాకుండా ఉండలేకపోతున్నా అని షణ్ముఖ్ సిరితో అంటే.. నాకు దూరంగా ఉండు మరి ఎవరు వద్దన్నారని సిరి చెబుతుంది. శ్రీరామ్, సన్నీ, కాజల్, మానస్‌లు పాత్రల్లో ఉండి పెర్ఫామెన్స్ ఇస్తుంటే.. సిరి, షన్నూలు మాత్రం ఈ ట్రిప్పింగ్ ముచ్చట్లలోనే మునిగిపోయారు.

ఇంతలో బాలయ్య ‘సింహా’ సాంగ్ వేయగా.. సన్నీ డాన్స్ వేస్తూ.. సిరిని ఎంతపిలిచినా.. షన్నూ కనుసైగలకు భయపడి కూర్చునే ఉండిపోయింది. సన్నీ, కాజల్, మానస్‌లు మాత్రమే డాన్స్ చేశారు. పాట అయిపోయిన తరువాత సన్నీ.. జై బాలయ్య అంటూ రెచ్చిపోయాడు. తర్వాత అబ్బని తీయని దెబ్బ సాంగ్‌కు మానస్‌ – కాజల్‌ జబర్దస్త్ డ్యాన్స్ చేశారు. శ్రీరామ్ కోసం ముఠామేస్త్రి సాంగ్ వేశారు.

తర్వాత రెండో దశలో ఇంటి సభ్యులంతా కలిసి వారి వారి పాత్రలో ఒక టాస్క్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించగా.. సిరి, సన్నీ, కాజల్, మానస్‌లు మాట్లాడుకుంటూ.. షణ్ముఖ్‌ని స్కిట్ కోసం చర్చించడానికి పిలుస్తారు. ఆ తరువాత అతని వెనకాల తోకలా సిరి వెళ్లి.. నాతో నీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? మీ బ్యాచ్ చేసుకోండి అంటున్నావ్ ఏంటి? అని సిరి అడగ్గా.. మీరంతా ఒక బ్యాచ్ కదా.. నాతో ఉంటే మూడ్ ఆఫ్‌లో ఉంటా.. వాళ్లతో ఉంటే ఫన్ ఉంటుంది అంటూ సోల్లు చెబుతాడు.తాను స్కిట్ చేయను.. అంటూ సిరి వాష్ రూంలోకి వెళ్లిపోగా.. ఆ వెనుక షణ్ముఖ్‌వెళ్లి.. తప్పు నాదే.. నేనే ట్రిప్ అయ్యాను.. మనిద్దరికీ బాత్ రూంలో గొడవకి దరిద్రమైన పాస్ట్ ఉంది అని చెబుతాడు షన్ను. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. మన ఫ్రెండ్ షిప్‌కి వాల్యూ ఇస్తా.. నిన్ను నేను కాకపోతే ఎవరు అర్ధం చేసుకుంటారు అంటూ మళ్లీ ఇద్దరూ హగ్ చేసుకోవడం కొసమెరుపు.