కోహ్లీ కంటే రోహిత్ బెస్ట్: గంభీర్

244
gambir
- Advertisement -

టిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని కితాబిచ్చారు భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్. సోషల్ మీడియా ద్వారా పలువరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన గంభీర్..వన్డే, టీ20ల్లో కోహ్లీతో పోలిస్తే రోహిత్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని చెప్పుకొచ్చాడు.

ఓవరాల్‌ గేట్రెస్ట్ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఉండకపోవచ్చు కానీ రోహిత్ ఎప్పటికి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని చెప్పుకొచ్చాడు.రోహిత్ శర్మ కంటే కోహ్లీ ఎక్కువ పరుగులు చేయొచ్చు…కానీ రోహిత్ శర్మ సెంచరీ తర్వాత ఒకవేళ ఔటైతే అయ్యో అతను డబుల్ సెంచరీ మిస్సయ్యాడే అని అభిమానులు భావిస్తారని అందుకే రోహిత్ గొప్ప అన్నారు.

భారత తరఫున 224 వన్డేలాడిన రోహిత్ శర్మ 88.92 స్ట్రైక్‌రేట్‌తో 9,115 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 248 వన్డేల్లో 93.25 స్ట్రైక్‌రేట్‌తో 11,867 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 108 టీ20 మ్యాచ్‌ల్లో 138.78 స్ట్రైక్‌రేట్‌తో 2773 పరుగులు చేయగా.. 82 టీ20ల్లో కోహ్లీ 138.24 స్టైక్‌రేట్‌తో 2794 పరుగులు చేశాడు.

- Advertisement -