రోహిత్ పిక్‏‏పై చాహల్ చిలిపి కామెంట్…

147
Rohit Sharma's Wife Ritika Gives Hilarious Reply To Yuzvendra ...

ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ముగిసిన తరువాత టీమిండియా క్రికెటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. ధోని, తన భార్య స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తన భార్యతో కలిసి విదేశాలలో విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. వన్డే, టీ20ల్లో రాణించినప్పటికీ సెలెక్టర్లు రోహిత్ ను ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కి ఎంపిక చేయలేదు. ఇక కాళీ సమయం దొరకడంతో భార్యతో కలిసి విహరిస్తున్నాడు.

rohit-sharma-chaha

ముందుగా లండన్ చుట్టొచ్చిన రోహిత్ జంట.. ప్రస్తుతం ప్రేగ్ లో విహరిస్తున్నారు. అందమైన నగరం ప్రేగ్ లో విహరిస్తున్నా అంటూ తన భార్యతో సెల్ఫీ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోకి స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ ఓ చిలిపి కామెంట్‌ చేశాడు. మిస్ యు రోహితా..శర్మా.. అంటూ పేరును సాగదీస్తూ కామెంట్‌ పెట్టాడు. ఈ కామెంట్ కి రోహిత్ భార్య రితికా సజ్దె రిప్లై ఇచ్చింది. యూజీ.. ప్రస్తుతం రోహిత్‌ నావాడు’ అంటూ రితికా రిప్లై ఇచ్చింది. ఇప్పుడు రోహిత్ జంట ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.