శ్రీలంక సిరీస్‌లో రెచ్చిపోయి ఆడుతున్న టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డుకెక్కాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో డబుల్ సెంచరీ, టీ20లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన రోహిత్ ఖాతాలోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 65 సిక్సర్లు బాదిన రోహిత్.. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డుల కెక్కాడు.
విరాట్ కోహ్లీ గైర్హాజరీతో శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్.. రెండు సిరీస్‌లలోనూ భారత్‌కు అపూర్వ విజయాలు అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నమోదు చేశాడు. మొహాలీలో జరిగిన రెండో వన్డేలో అజేయంగా 208 పరుగులు చేసిన రోహిత్ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఇండోర్‌లో జరిగిన రెండో టీ20లో 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ రికార్డును సమం చేశాడు రోహిత్. ఇక కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తొలి సిరీస్‌నే భారత్‌కు అందించిన ఆటగాడిగా రోహిత్ మరో రికార్డు నెలకొల్పాడు.