మహిళలు.. న్యూఇయర్ వేడుకల్లో జాగ్రత్త…

179
police
- Advertisement -

గతేడాది బెంగళూరులో జరిగిన న్యూఇయర్ వేడుకల్లో అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గత సంవత్సర అనుభవాల దృష్ట్యా బెంగళూరు పోలీసులు రాబోయె న్యూఇయర్ వేడుకలకు ఇప్పటి నుంచే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.డిసెంబరు 31 న జరగబోయే కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనే మహిళలపై లైంగిక వేధింపుల నివారణ కోసం ప్రత్యేకంగా రోడ్డుపై బారికేడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

new-years

మగతోడు లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అమ్మాయిలు పాల్గొనకూడదని పోలీసులు సూచించారు. ఈ ఏడాది వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు వ్యాపారుల సంఘాలు, పౌరుల సంఘాలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు.

- Advertisement -