కేరళలోని త్రిస్సూర్ జిల్లా, మాలా సమీపంలో ఉన్న పున్నక్కపరంబిల్ భద్రకాళి విష్ణుమాయ ఆలయంలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఈ ఆలయానికి ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్’ అని పేరు పెట్టిన ఒక భారీ రోబోటిక్ ఏనుగును కానుకగా సమర్పించారు. జంతు సంరక్షణ సంస్థ అయిన పీటా ఇండియా (PETA India) ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి ఉచితంగా అందించింది.
ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ రోబోటిక్ ఏనుగుకు ఆలయంలో ‘నడయిరుత్తల్’ (ఆచారబద్ధమైన సమర్పణ) కార్యక్రమం నిర్వహించారు.ఈ రోబోటిక్ ఏనుగు సుమారు 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉంటుంది. కేరళలో ఇప్పటివరకు తయారైన రోబోటిక్ ఏనుగుల్లో ఇది అత్యంత ఎత్తైన వాటిలో ఒకటి. దీని బరువు సుమారు 50 టన్నులు.
ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వ్యవస్థపై పనిచేస్తుంది. ఏనుగు కదలికల కోసం ప్రత్యేకమైన ట్రాలీ మెకానిజంను ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో ప్రత్యేకమైన లైటింగ్ మరియు సౌండ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. దీని తయారీకి సుమారు రూ. 5.31 లక్షలు ఖర్చు అయినట్లు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది.
నిజమైన ఏనుగులను పండుగలు, ఊరేగింపుల పేరుతో బంధించి హింసించకూడదనే ఉద్దేశంతో ఈ రోబోటిక్ ఏనుగును ప్రవేశపెట్టారు. ఈ రోబోను ఇతర ఉత్సవాలకు మరియు వేడుకలకు కూడా అందుబాటులో ఉంచాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. తద్వారా జంతు సంక్షేమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని వారు భావిస్తున్నారు.
ఈ వినూత్న కార్యక్రమాన్ని శాంతిగిరి ఆశ్రమం హెడ్ స్వామి మధురనాథన్ జనతపస్వి ప్రారంభించగా, ఆలయ ట్రస్ట్ సభ్యులు మరియు పీటా ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read:తమిళనాడు సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

