థ్రిల్లింగ్‌గా రాబిన్ హుడ్ ట్రైలర్

4
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా మార్చి 28న ఈ సినిమా విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది . సినిమాలో డేవిడ్ వార్నర్ కూడా నటిస్తుండగా ట్రైలర్‌లో వార్నర్‌ను కూడా చూపించారు. హెలికాప్టర్‌ నుంచి దిగుతూ లాలీపాప్‌ తింటూ నడుస్తూ వచ్చిన సీన్‌ ఇందులో చూడొచ్చు. కామెడీ, యాక్షన్ నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది. నితిన్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా తెరకెక్కింది.

Also Read:IPL 2025 :బోణీ కొట్టిన బెంగళూరు..

- Advertisement -