దొంగ నా కొడుకు..క్రైమ్ కామెడీ

3
- Advertisement -

సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్లను అందిస్తున్న పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, మరోవైపు మీడియం బడ్జెట్‌తో కంటెంట్‌కు ప్రాధాన్యమున్న సినిమాలను కూడా నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేసి ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈశ్వర్ బీటెక్ మధ్యలోనే చదువు ఆపేసిన యువకుడు. డబ్బుకే ప్రాధాన్యమిచ్చే తల్లిదండ్రులు, ఓ స్నేహితుడు, ప్రేయసి.. ఇలా అతడి జీవితంలో చాలామంది ఉంటారు. అయితే వచ్చే జన్మలో వీళ్లెవరూ తనకు వద్దని, కేవలం డబ్బు మాత్రమే కావాలని ఈశ్వర్ కోరుకుంటాడు. ఈ క్రమంలో కథలోకి రాబరీ, క్రైమ్ అంశాలు ప్రవేశించడంతో కథనం ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. చివర్లో బీచ్‌లో ఈశ్వర్, అతడి ప్రేయసి మధ్య జరిగే సరదా టిఫిన్ ఎపిసోడ్‌తో టీజర్ నవ్వులు పంచుతూ ముగుస్తుంది.

‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. పౌడర్ సీక్వెన్స్ నుంచి జీవితం గురించి ఆయన చెప్పే సరదా మాటలు, చివర్లో వచ్చే టిఫిన్ ఎపిసోడ్ వరకు పలు సన్నివేశాల్లో తనదైన హాస్యాన్ని పండించారు. ఆయన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రలోని విభిన్న కోణాలు టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేయసి పాత్రలో సుష్మిత శెట్టి సహజంగా కనిపించారు. అలీ, రజిత ఈశ్వర్ తల్లిదండ్రులుగా నటించగా, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read:ఎమ్మెల్యే వివేకా బర్త్ డే..గ్రీన్ ఛాలెంజ్

దర్శకుడు శ్రీను కంబాల కథానాయకుడి విభిన్నమైన వ్యక్తిత్వం, హాస్యభరిత సన్నివేశాల చుట్టూ కథను అల్లుకున్నారు. మౌళి పాత్రను తీర్చిదిద్దిన తీరు, కథలోని వివిధ సన్నివేశాల్లో కామెడీని జోడించిన విధానం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే దర్శకుడి ప్రయత్నాన్ని తెలియజేస్తున్నాయి.

- Advertisement -