సుమంత్ ప్రభాస్..‘బబ్లూ XXL’

7
- Advertisement -

ప్రముఖ నిర్మాతలు పుష్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ ఎన్. నారంగ్ నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ తమ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ నంబర్ 10తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యంగ్ ట్యాలెంటెడ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జెన్ జెడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా సాయిలు కంపాటి దర్శకుడిగా రెండో సినిమా. ఆయన తొలి చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్రానికి ‘బబ్లూ XXL’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, మేకర్స్ కలర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దసరా పర్వదినం సందర్భంగా ప్రకటించిన ఈ టైటిల్, పోస్టర్ సినిమా యూత్‌ఫుల్, ఫన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి.

సుమంత్ ప్రభాస్ కలర్‌ఫుల్ ఫ్లోరల్ షర్ట్, స్టైలిష్ హెయిర్‌స్టైల్‌తో ఉత్సాహంగా, సరదాగా కనిపిస్తున్నారు. విక్టరీ సైన్‌తో చలాకీగా పోజిచ్చిన ఆయన లుక్ సినిమా యూత్‌ఫుల్ వైబ్‌కు సరిగ్గా సరిపోయింది. పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో మంచిర్యాల పట్టణ ప్రత్యేకతలను అందంగా చూపించారు. అక్కడి ప్రసిద్ధ క్లాక్ టవర్, చారిత్రక రాతి వంతెన, ఆలయ నిర్మాణ శైలి, ఇతర స్థానిక ప్రదేశాలు పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ సరసన గహజీ ఎస్‌కే కథానాయికగా నటిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, జయలలిత, శివాజీ రాజా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read:ఎమ్మెల్యే వివేకా బర్త్ డే..గ్రీన్ ఛాలెంజ్

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. నరేష్ అడుప ఎడిటింగ్ నిర్వహిస్తుండగా, పవన్ కల్యాణ్ ఎల్లపు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆసక్తికరమైన టైటిల్, యూత్‌ఫుల్ ప్రజెంటేషన్‌తో ‘బబ్లూ XXL’ తొలి పోస్టర్‌తోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఈ రాబోయే ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఆధునిక ట్రెండ్‌కు తగ్గట్టుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తరహా డిజైన్‌తో పోస్టర్‌ను రూపొందించారు. లైక్స్, కామెంట్స్, షేర్స్, ప్రొఫైల్ వివరాలతో కూడిన సోషల్ మీడియా ఇంటర్‌ఫేస్ పోస్టర్‌కు డిజిటల్ యుగానికి తగిన ట్రెండీ లుక్‌ను తీసుకొచ్చింది. అంతేకాకుండా, మంచిర్యాలలోని ప్రసిద్ధ రాతి వంతెనపై హీరో, హీరోయిన్ కలిసి అందమైన క్షణాలను ఆస్వాదిస్తున్న దృశ్యం కూడా పోస్టర్‌లో ఆకట్టుకుంటోంది.

- Advertisement -