న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్ తెరకెక్కిన మూవీ గ్యాంగ్ లీడర్. ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈచిత్రం ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. విభిన్నమైన పాయింట్‌తో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో సాగుతుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.
ఈసినిమాలోని రా రా సాంగ్ ఈరోజు సాయంత్రం 7గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్రయూనిట్. ఇక ఈ చిత్రం టీజర్ ను ఈనెల 24న విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 30వ తేదిన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆర్ ఎక్స్ 100హీరో కార్తీకేయ ఈసినిమాలో ప్రత్యేక పాత్రలో నటించగా తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. వరుస హిట్లతో దూకుడుమీదున్న నానికి ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.