కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ బద్దమే: సీఎం కేసీఆర్

424
cm kcr
- Advertisement -

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు సీఎం కేసీఆర్‌. శాసనసభ ప్రత్యేక సమావేశాల సందర్భంగా మాట్లాడిన సీఎం…కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క లెవనెత్తిన విషయంపై స్పష్టత ఇచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని… ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చినా, ఏం చెప్పినా ప్రజలు నమ్మలేదన్నారు.

జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయం సాధించింది. 32 జిల్లా పరిషత్‌లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. 92 శాతం మండల పరిషత్‌లను, 83 శాతం గ్రామపంచాయతీలను గెలుచుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు నిబంధనల ప్రకారమే టీఆర్‌లో విలీనం అయ్యారని చెప్పారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్ మమ్మల్ని నిందించడం ఎందుకని ప్రశ్నించారు. 1/3వ వంతు సభ్యులు విలీన లేఖ ఇచ్చిన తర్వాత అది చట్టవిరుద్ధం కాదన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదని…. కర్ణాటక, గోవాలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని గుర్తు చేశారు.ఏపీలో టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారని గుర్తుచేశారు.

- Advertisement -