జగిత్యాల జిల్లా కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 51 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది ప్రయాణికులు ఉన్నారు.
కొండగట్టు ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.ఘాట్ నుంచి మరో నిమిషంలో ప్రధాన రహదారిపైకి చేరుకునే సమయంలో ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పడంతో ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.