కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

5
- Advertisement -

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది.ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును చిత్రదుర్గ జిల్లా గొర్లత్తు గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా మారడానికి ప్రధాన కారణం బస్సులోని డీజిల్ ట్యాంకర్‌ను లారీ బలంగా ఢీకొట్టడమేనని అధికారులు తెలిపారు. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే మొత్తం బస్సు అగ్నికి ఆహుతైంది.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది సజీవదహనం అయి మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. మరికొందరు తీవ్రంగా గాయపడగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది.

సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read:KCR:అహింసా–శాంతి ..క్రీస్తు చూపిన మార్గం

- Advertisement -