యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
పాపులను సైతం క్షమించమనే త్యాగశీలత, ఓర్పు, సహనం, మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన అహింసా–శాంతి మార్గమని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్ మైనారిటీలకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశానికే ఆదర్శంగా అమలు చేశామని తెలిపారు.
క్రిస్మస్ పర్వదినాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సెక్యులర్ సంప్రదాయాన్ని అమలులోకి తెచ్చిందని గుర్తు చేశారు.పీడన నుంచి విముక్తి లభించేలా దీవిస్తూ, రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని యేసు క్రీస్తును కేసీఆర్ గారు ప్రార్థించారు.
Also read:హైలెస్సో..వడ్డీ కాంతమ్మగా అక్షర

