కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ దేశ ప్రజలకు ఏమి చేయక పోగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూన్నారన్నారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. అరోగ్యం కుదురుకున్న తర్వాత తొలిసారి డిల్లీ నుంచి పట్నా వచ్చినాయన…. పార్టీనేతలు, కార్యకర్తలతో పట్నాలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆయనను పలు ప్రశ్నలు అడగ్గా హఠానా హై…! హఠానాహై…! అని వ్యాఖ్యనించారు. నియంతృత్వ ప్రభుత్వాన్ని దించాలి, మోదీని తొలగించాలి అని లాలూ మీడియాతో మాట్లాడారు. బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ నేత సుశీల్ మోదీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. సుశీల్ మోదీ అబద్దాల కోరు ఆయన చెప్పేవన్నీ అవాస్తవం అని అన్నారు.
ఇటీవలే బీహార్‌లో రాజకీయా పరిణామాలు అనూహ్యంగా ఒక్కసారిగా మారిపోయాయి. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన మాదిరిగా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నడంపై అప్రమత్తమైన నితీశ్… ఎదురు తిరిగిన సీనియర్ నేతపై వేటు వేయడంతోపాటు సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎన్డీయే కూటమి నుంచి, ప్రభుత్వం నుంచి తప్పుకొని… ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి మద్దతుతో 8వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహాకూటమితో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. ఆగస్టు 15న బీహార్‌లో మహాకూటమి ఆద్వర్యంలో 20లక్షల ఉద్యోగాల కల్పనే ద్యేయంగా ముందుకు సాగుతుందని సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు.