బిగ్ బాస్ 5: ఆర్జే కాజల్‌ను అందుకే నామినేట్ చేశారా!

307
- Advertisement -

బిగ్ బాస్ 5 ప్రారంభంతోనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. ఈసారి కూడా నాగ్ హోస్ట్‌గా చేస్తున్న సీజన్-5 లో మొత్తం పంతొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఉండటంతో కాస్త షో గందరగోళంగా మారందని కూడా కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన మరుసటిరోజే సోమవారం రావడంతో నామినేషన్స్ కూడా మొదలయ్యాయి.

అయితే బిగ్ బాస్ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీతో ఎంట్రీ ఇస్తారు. ఇంకొందరు ఎలాంటి ప్లాన్లు, ప్రణాళికలు వేసుకోకుండా.. సమయాన్ని, సందర్భాన్ని బట్టి వెళ్తుంటారు. అయితే కొందరు మాత్రం బిగ్ బాస్ షోలను చూసి, ఎత్తులను వడపోసి, పై ఎత్తులను వేసేద్దామని, ముందుగానే అంతా ప్రిపేర్ చేసుకుని వస్తుంటారు. ఈ ఐదో సీజన్‌లోనూ అలాంటి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఆర్జే కాజల్. ఇంత వరకు బిగ్ బాస్ షోలకు రివ్యూలు ఇస్తూ తన స్టైల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

ఈ సారి ఏకంగా కంటెస్టెంట్‌గానే కాజల్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇది తన చిన్నప్పటి నుంచి కల అని, తనకు ఇష్టమైన షో అని కాజల్ తెగ ఎమోషనల్ అవుతోంది. అయితే కాజల్ వేసే ప్రతీ అడుగును అటు కంటెస్టెంట్లు, ఇటు ఆడియెన్స్ కూడా పసిగట్టేశారు. సోమవారం నాటి నామినేషన్ ప్రక్రియలో అందరూ ఆర్జే కాజల్‌ను అదే కారణంతో నామినేట్ చేశారు. ఆర్జే కాజల్ ప్రతీది కూడా కాలిక్యులేటెడ్‌గా చేస్తోందని, ఏం టైంకు ఏం చేయాలో.. అని ఆలోచిస్తుంటుందని అందరూ నామినేట్ చేశారు.

ఇక కాజల్ చేష్టలు కూడా అలానే ఉన్నాయి. ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్‌తో కలిసి కూర్చోవడం, పర్సనల్ విషయాలను డిస్కస్ చేయడం, ఆమెను ఓదార్చడం వంటివి చూస్తే సింపతీ కోసమే చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఆమె నామినేషన్ ప్రక్రియలో భాగంగా తనను నామినేట్ చేసిన కారణంతో తిరిగి నామినేట్ చేస్తోన్నట్టు చెప్పేసింది. సరయు, ప్రియలను ఆర్జే కాజల్ నామినేట్ చేసింది. నా బిగ్ బాస్ కలకు అడ్డం పడుతున్నారు కాబట్టే వారిని నామినేట్ చేస్తున్నాను అని కాజల్ చెప్పేసింది. ఈ నేపథ్యంలో కాజల్‌కు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో చూడాలి.

- Advertisement -