సుశాంత్‌తో సహజీవనం చేశా:రియా చక్రవర్తి

71
riya

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత సుప్రీంకోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో ఆసక్తికర విషయాలను వెల్లడించింది నటి రియా చక్రవర్తి. సుశాంత్‌తో తాను ఏడాది కాలం పాటు సహజీవనం చేశానని …తనను వేధించేందుకే సుశాంత్ తండ్రి తనపై కేసు దాఖలు చేశారని వెల్లడించింది.

బీహార్ పోలీసులు ద‌ర్యాప్తులో భాగంగా త‌న‌ను వేధించే అవకాశాలున్నాయని…ఈ కేసును ముంబైకి బదిలీ చేయాలని పిటిషన్‌లో సుప్రీంను కోరింది రియా.సుశాంత్ తండ్రి కేకే రాజ్‌పుత్ బీహార్ పోలీసు శాఖ‌లో ప‌నిచేశార‌ని, త‌న‌కు న్యాయం జ‌రగ‌దని తెలిపింది.

సుశాంత్‌ను రియాతో పాటు ఆమె కుటుంబ‌స‌భ్యులు మాన‌సికంగా వేధించార‌ని, త‌న కుమారుడిని సూసైడ్ చేసుకునేలా ప్రోత్స‌హించార‌ని తండ్రి కేకే రాజ్‌పుత్ ఆరోపించారు. సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు ఎక్క‌డికి బ‌దిలీ అయ్యాయ‌న్న కోణంలో ఈడీ ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నుంది.