బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి!

36
Rishi Sunak
- Advertisement -

బ్రిటన్ ప్రధాని రేసులో నిలిచారు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్(42). ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు. మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన రిషి బుధవారం తొలి రౌండ్‌ లో ఆధిక్యం సాధించారు. అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను గెలుచుకోగా.. ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డంట్‌ 67 ఓట్లతో గట్టి పోటీ ఇస్తున్నారు.

గురువారం కన్జర్వేటివ్‌ ఎంపీలు తమ ఫేవరెట్‌ అభ్యర్థులను ఎన్నుకుంటారు. జూలై 21కల్లా ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగులుతారు. టాప్ 2లో ఉన్న రిషి, పెన్నీయే రేసులో ఉంటారని అంచనా. తర్వాత 2 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో అత్యధిక మంది సపోర్ట్ కూడగట్టుకునే వారే పార్టీ నేతగా ఎన్నికై సెప్టెంబర్‌ 5న ప్రధాని పదవిని స్వీకరించనున్నారు.

- Advertisement -