నేను హిందువునే…రిషి ఫ్యామిలీ హిస్టరీ ఇదే

239
rishi
- Advertisement -

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు రిషి సునాక్. అనూహ్యంగా ప్రధాని రేసులోకి వచ్చి పదవి చేపట్టిన ట్రస్‌ అనుకోని విధంగా పీఠం నుంచి దిగిపోవడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఎక్కువమంది ఎంపీల మద్దతు రిషికే ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా ప్రధానిగా ఎన్నికయ్యారు.

తాను హిందువునని రిషి సునక్ గర్వంగా ప్రకటించుకున్నారు. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. ఆయన గెలుపు కోసం బ్రిటన్‌లోని భారత సంతతి ప్రజలు పూజలు సైతం చేశారు.

యూకే 57వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండగా తాను హిందువునని గర్వంగా ప్రకటించుకున్నారు రిషి. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. తాను బ్రిటీష్ పౌరుడైనప్పటికీ గర్వించదగిన హిందువుగా కొనసాగతున్నానని చెప్పారు.

2009లో అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. అక్షత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు మరియు భారతదేశంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమార్తె. సునక్ దంపతులకు లండన్‌, యార్క్‌షైర్‌లోని సునక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మరియు కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో గృహాలు ఉన్నాయి. సునక్ రాజకీయ జీవితం 2015లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌లో టోరీ సీటును గెలుచుకోవడంతో ప్రారంభమైంది.

రిషి సునాక్ తండ్రి యశ్వీర్ డాక్టర్ కాగా, తల్లి ఉష ఓ మెడికల్ షాపు యజమాని. 2001-04 మధ్యకాలంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ సాక్స్ లో అనలిస్ట్ గా పనిచేశారు. 2004 నుంచి 2015 మధ్య కాలంలో వివిధ ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించారు. బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. బ్రిటన్ లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునాక్ ఫ్యామిలీ ఒకటి.

- Advertisement -