బ్రిటన్‌కు నూతన ప్రధానమంత్రిగా రిషిసునాక్‌ను ఎంపిక చేసిన బ్రిటన్ రాజు చార్లెస్-3. ఈయన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు ప్రధాని బాధ్యతలు అప్పగించిన విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన చేసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చార్లెస్3 నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు రిషి వెల్లడించారు. గత రెండు వందల సంవత్సరాల తర్వాత అతి చిన్న వయసు ఉన్న వ్యక్తిగా చరిత్రను లిఖించారు. దీంతో బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. గతంలో బోరిస్ హయంలో బ్రిటన్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడమే తన మొదటి లక్ష్యమని రిషి తన తొలి ప్రసంగంలో వెల్లడించారు. బ్రిటన్ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తా. వారి శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు శ్రమించి పనిచేస్తా. భవిష్యత్ తరాలు రుణ ఊబిలో ఉండకుండా చేస్త అని ఆయన తెలిపారు. మాటలతో కాకుండా చేతల ద్వారా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తానన్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపైనా ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు.