తెలంగాణలో కరోనా ఫ్రీ జిల్లాలివే..!

296
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా ఫ్రీ జిల్లాలు 11 ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 1016 మంది బాధితులు కరోనా వైరస్‌ బారిన పడగా నిన్న 35 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

కరోనా ఫ్రీ జిల్లాలు: సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ములుగు.

- Advertisement -