రిషబ్ పంత్….అదరహో!

100
pant

ఫార్మాట్ ఏదైన అద్భుత ఫామ్‌తో సత్తాచాటుతున్నాడు భారత స్టార్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్. ఐపీఎల్ 14వ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న పంత్…తన ఫామ్‌ని కంటిన్యూ చేయగా తాజాగా అరుదైన రికార్డు సృష్టించాడు.

తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో ఆరో ర్యాంకు సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇదే మదటి సారి కాగా 23ఏండ్ల వయసులోనే పంత్‌ ఈ ఘనత సాధించడం విశేషం. భారత వికెట్‌ కీపర్‌ ఈ ఫార్మాట్‌లో సాధించిన అత్యధిక ర్యాంకింగ్‌ ఇదే.

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ను పంత్‌ వెనక్కి నెట్టి ఆరో స్థానం దక్కించుకున్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా హెన్రీనికోల్స్‌-7, రోహిత్‌ శర్మ-8 కూడా 747 రేటింగ్‌ పాయింట్లతో టాప్-10లో ఉన్నారు.