ఎన్నారైలంతా సీఎం కేసీఆర్‌ వెంటే : మహేష్‌ బిగాల

71
mahesh bigala

సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకోవడం సంతోషంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఎన్నారైలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని తెలిపారు. ఇన్నాళ్లు టీఆర్‌ఎస్‌లో ఉండి విపక్షాలతో మమేకమైన ఈటల రాజేందర్‌పై మహేష్ బిగాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఎన్నారైలంతా సీఎం కేసీఆర్‌ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.

ఈటల వ్యవహారంలో యూఎస్‌ఏ ఎన్నారైల కోర్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లోనే ఉంటూ పార్టీని కూల్చాలని విఫల యత్నం చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమంతా కట్టుబడుతామన్నారు. సీఎం కేసీఆర్‌ ఏదిచేసినా రాష్ట్రం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారని గుర్తు చేశారు.

సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తపరుస్తూఎన్నారైలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ కోర్ కమిటీ సభ్యులు మహేష్ తన్నీరు, చందు తాళ్ల, పూర్ణ బైరి,శ్రీనివాస్ గనుగొని, వెంగల్ జలగం, భాస్కర్ పిన్న, మహేష్ పొగాకు, రిషికేష్ రెడ్డి, వెంకట్ గౌడ్ పాల్గొన్నారు.