మరాఠా రిజర్వేషన్లు రద్దు..

171
sc
- Advertisement -

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. ఆర్ధిక,సామాజిక వెనుకబాటు తనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని….50 శాతానికి రిజర్వేషన్లు మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్లేనని తేల్చి చెప్పింది.

బుధవారం మారాఠా రిజర్వేషన్లపై తీర్పును వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం… రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే,పీజీ మెడికల్‌ కోర్సుల్లో కొత్త రిజర్వేషన్ల చట్టం మేరకు ఇప్పటికే చేపట్టిన ప్రవేశాలు కొనసాగుతాయని తెలిపింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.

విద్య, సామాజికపరంగా వెనుకబడిన వర్గంగా మరాఠా సామాజిక వర్గాన్ని గుర్తిస్తూ 2018లో మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిజర్వేషన్లపై బాంబే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మార్చి 26న తీర్పు రిజర్వు

చేయగా.. మరాఠా రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టివేస్తూ బుధవారం తీర్పును వెలువరించింది.

- Advertisement -