WCL:ఆస్ట్రేలియా ఛాంపియన్స్ యజమానిగా పాంటింగ్

2
- Advertisement -

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్ అత్యంత ఆసక్తికరంగా, భారీ స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్న వేళ ‘ఆస్ట్రేలియా ఛాంపియన్స్’ జట్టులో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. మెల్‌బోర్న్‌లోని యురేకా 89లో జరిగిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్: ఎ న్యూ ఎరా” విలేకరుల సమావేశంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఈ ఫ్రాంచైజీ సహ యజమానిగా బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించారు. అలాగే, డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు కెప్టెన్‌గా నియమించారు.

ఈ ప్రత్యేక మీడియా సమావేశంలో రికీ పాంటింగ్, సహ యజమాని పునీత్ సింగ్, డేవిడ్ వార్నర్ సహా డబ్ల్యూసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.పునీత్ సింగ్‌తో కలిసి రికీ పాంటింగ్ యాజమాన్య బాధ్యతలు స్వీకరించడం ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌కు సరికొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది. కాగా, డబ్ల్యూసీఎల్ సీజన్ 3లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టును డేవిడ్ వార్నర్ ముందుండి నడిపించనున్నారు.

ఆస్ట్రేలియా ఛాంపియన్స్ మరియు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో భాగస్వామిని కావడం చాలా సంతోషంగా ఉంది. పునీత్ సింగ్, మా టీమ్ మరియు ముందుండి నడిపించే డేవిడ్ వార్నర్‌లతో కలిసి ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల కోసం ఒక అద్భుతమైన జట్టును నిర్మించే అవకాశం మాకు లభించింది అని పాంటింగ్ తెలిపారు.

ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌కు ఇది ఎంతో ఉత్సాహభరితమైన కొత్త అధ్యాయం. రికీ పాంటింగ్ మాతో చేరడం, డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడం వల్ల జట్టుకు అపారమైన అనుభవం, బలమైన నాయకత్వం మరియు అదనపు శక్తి లభించాయి. అద్భుత విజయాన్ని అందుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అన్నారు పునీత్ సింగ్ (యజమాని, ఆస్ట్రేలియా ఛాంపియన్స్).

Also Read:అసెంబ్లీ నుండి BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్

డబ్ల్యూసీఎల్ సీజన్ 3లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌ను నడిపించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. మైదానంలోకి దిగి, క్రికెట్ దిగ్గజాలతో కలిసి ఆడుతూ అభిమానులను అలరించడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు అన్నారు డేవిడ్ వార్నర్ (కెప్టెన్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్).

- Advertisement -