అసెంబ్లీ నుండి BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్

1
- Advertisement -

17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ చేశారు. హరీష్‌ రావు, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని,జగదీష్ రెడ్డి,అనిల్ జాదవ్,సునీత, కోవాల లక్ష్మీ తదితరులు ఉన్నారు.

తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కేటీ రామారావు) వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరు/దాడి ఆరోపణలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రాణహాని బెదిరింపులు మరియు రాష్ట్రంలో మొత్తం శాంతిభద్రతల పరిస్థితిపై అసెంబ్లీలో తక్షణమే చర్చ జరపాలని ఈ నోటీసు ద్వారా కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి చేరుకున్న కేటీఆర్, సభా నిబంధనల్లోని రూల్ 63 కింద సభను వాయిదా వేసి ఈ అంశంపై చర్చించాలని స్పీకర్‌ను కోరారు.గతంలో అసెంబ్లీ వద్ద తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై జరిగిన పోలీసుల దాడికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also Read:BB10:సైన్యం టాస్క్‌లో మంటలు!

May be an image of ticket stub and text

- Advertisement -