మహాత్మునికి ఘన నివాళి

91
gandhi
- Advertisement -

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా యావత్ దేశం ఘనంగా నివాళి అర్పిస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపితకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ….గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఫలాలు దేశంలో ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. అందరికీ సమానంగా పరిపాలన చేరువవ్వాలని తెలిపారు. గాంధీజీ స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పరిపాలన చేస్తున్నారని వెల్లడించారు.

జాతిపిత గాంధీజీ ప్రపంచానికే ఆద‌ర్శంగా నిలిచారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. బాపూజీ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్‌ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. గాంధీజీ 153వ జయంతి సందర్భంగా మహాత్మునికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

గాంధీజీ 153వ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కర్‌, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే.. మహాత్ముని సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

- Advertisement -