మొక్కలు నాటిన ములుగు అధికారిణులు..

143
Green India Challenge

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ములుగు జిల్లా ప్రభుత్వ అధికారిణులు భాగ్యలక్ష్మి డీఎంసీడబ్ల్యూఒ మరియు మల్లీశ్వరి డీడబ్ల్యూఒ మూడు మొక్కలు నాటారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఛాలెంజ్‌లో భాగంగా ములుగు జిల్లా రెవిన్యూ అధికారి రమాదేవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ములుగులోని సాంఘిక సంక్షేమం కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా అంగన్ వాడి పాఠశాల ఉపాధ్యాయులు చేత జిల్లా అంతటా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని విస్తరింప చేస్తామని, భవిష్యత్ తరాలకు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న ఎంపీ సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.