రియాకు షాకిచ్చిన ముంబై కోర్టు..!

120
Rhea Chakraborty

బాలీవుడ్ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో రియా చక్రవర్తిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.సుశాంత్‌కు డ్రగ్స్ అందించినట్లు రియా అంగీకరించడంతో ఎన్‌సీబీ మూడు రోజుల విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేసింది.రియాకు డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 22 వరకూ కోర్టు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రియాను బైకుల్లా జైలుకు తరలించారు.

కాగా ముంబైలోని సెషన్స్ కోర్టులో ఆమె దాఖ‌లు చేసిన‌ బెయిల్ పిటిష‌న్ ను ఈ రోజు న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. దీంతో సెషన్స్ కోర్టులో ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది.అయితే అది కూడా తాజాగా తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది.

ఇక ఇదే కేసులో రియా సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తి అతనితోపాటు మ‌రికొందరి బెయిల్ పిటిష‌న్లు కూడా తిరస్క‌ర‌ణ‌కు గురి కావ‌డం గ‌మ‌నార్హం. వీరిద్దరితో పాటు ఈ కేసులో ఇప్పటికే ఎన్‌సీబీ అదుపులో ఉన్న అబ్దుల్ బాసిత్, జైద్ విలత్రా, సావంత్, శామ్యూల్ మిరండా బెయిల్ పిటిషన్లను కూడా ముంబై ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.