గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సింగర్ లక్మి భవజా..

228
Singer Lakshmi Bhavaja
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సింగర్ లక్మి భవజా మూడు మొక్కలు నాటారు. ఆర్టిస్ట్ అనంత్ బాబు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ ఎర్రగడ్డ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మరో ముగ్గురు ( దర్శకుడు వి.ఎన్. ఆదిత్య , సింగర్స్ యామిని , నూతన )లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -