గుత్తా సుఖేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు..

95
Gutha Sukender Reddy

శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది కాలం పూర్తి అయిన సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలోని చైర్మన్ ఛాంబర్ లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

మంత్రులతో పాటు చీప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ లు బాను ప్రసాద్, దామోదర్ రెడ్డి ,ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి,నారదాసు లక్ష్మణ్ రావు, భూపాల్ రెడ్డి,నవీన్ కుమార్ ,శ్రీనివాస్ రెడ్డి,తెర చిన్నపరెడ్డి, రామచందర్ రావు,గంగాధర్ గౌడ్,ఫారూఖ్ హుస్సేన్, జనార్దన్ రెడ్డి,కృష్ణ రెడ్డి, శేరి శుభాష్ రెడ్డిలు,మరియు శాసన మండలి,చైర్మన్ పేషీ ఉద్యోగులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.