హిట్‌ పడితే.. 2కోట్ల గిఫ్ట్‌..!

189
2crores gift for akhil

‘అఖిల్‌’తో డిజాస్టర్‌ ని టచ్‌ చేసిన అఖిల్‌, ఇప్పుడు హిట్ కోసం రిస్క్‌ చెయ్యడానికి కూడా వెనకాడట్లేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ అంటూ వస్తున్న అఖిల్‌ కి , నాగ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చేశాడంటూ ఫిల్మ్‌నగర్‌ లో టాక్‌. ఆ ఆఫరే 2కోట్ల గిఫ్ట్‌. నాగార్జున నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే నాగ్‌, అఖిల్‌ ప్రమోషన్స్ లో తెగ బిజీ అయిపోయారు.

2crores gift for akhil

బేసిక్‌గా అఖిల్ కి లేటెస్ట్ మోడల్ కార్లు అంటే చాలా ఇష్టమట. అయితే ‘హలో’తో అఖిల్‌ హిట్‌ కొడితే..2 కోట్ల ఖరీదు చేసే ఓ ఇంపోర్టెడ్ కారును బహుమతిగా ఇవ్వాలనే ఆలోచనతో నాగార్జున వున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో నాగార్జున .. అఖిల్ తో పాటు, అక్కినేని అభిమానులంతా వున్నారు.

 2crores gift for akhil

ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శిని కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇదిలా ఉంటే..ఈ సినిమాలో చేసినందుకు గాను అఖిల్ కి రెమ్యునరేషన్ ఇవ్వలేదట. ఇక అఖిల్ కి 2కోట్ల ఆఫర్  నిజమే అయితే..హిట్  కొట్టి దాన్నే రెమ్యూనరేషన్  గిఫ్ట్ అనుకోవాలి..!