ఫ్రెండ్ షిప్ డేపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. వైరల్

122
- Advertisement -

ఈరోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సం సందర్భంగా.. అందరు తమ నేస్తాలకు విషెస్ తెలుపుకుంటున్నారు. అయితే వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం వెరైటీగా స్పందించారు. ఏ విషయమైన సంచలనం చేయనిదే నిద్రపోని వర్మ.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా అంద‌రూ హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అంటూ పోస్టులు చేస్తుండ‌గా, వ‌ర్మ ‘హ్యాపీ ఎనిమీస్ డే’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే, స్నేహితులు ఎలా ఉంటారన్న విష‌యంపై ఆయ‌న అభిప్రాయం తెలిపారు.

‘స్నేహితుడికి సాయం చేస్తే ఓ స‌మ‌స్య వ‌స్తుంది. వాడికి మ‌రోసారి సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా మ‌ళ్లీ నీ ద‌గ్గ‌రికే వ‌చ్చి అడుతుతాడు’ అని రామ్ గోపాల్ వ‌ర్మ‌ పేర్కొన్నారు. ఇప్పుడు వర్మ ట్వీట్ వైరల్ అవుతోంది. వ‌ర్మ చేసిన ట్వీట్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. స్వ‌చ్ఛ‌మైన స్నేహానికి ఆర్జీవీ కొత్త నిర్వ‌చ‌నం ఇస్తూ స్నేహానికి ఉన్న విలువ‌ను చెడ‌గొడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు మాత్రం ఆర్జీవీ చెప్పిందే క‌రెక్టు అంటూ రిప్లై ఇస్తున్నారు.

- Advertisement -