13న జాన్ అబ్రహాం ‘అటాక్’ చేయబోతున్నాడు..

69

జాన్ అబ్రహాం హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘అటాక్’. ఆగస్ట్ 13న రిలీజ్ కాబోతోంది. శ్రీలంక బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను లక్ష్య రాజ్ ఆనంద్ తెరకెక్కించాడు. జాన్ అబ్రహాం ఇందులో కమాండోగా కనిపించనున్నాడు.

ఓ రెస్క్యూ ఆపరేషన్‌కి సంబంధించిన కథాంశంతో.. దేశభక్తి ప్రధానంగా రూపొందిన సినిమా కాబట్టి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 13న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇంతక ముందు జాన్ అబ్రహాం – జాక్విలిన్ ఫెర్నాండెజ్ కలిసి ‘డిషుమ్’, ‘హౌజ్ ఫుల్ 2’, ‘రేస్ 2’ సినిమాలలో నటించారు. నాలుగోసారి ‘అటాక్’ నటించారు.