తెల్లారితే వివాదాల్లో నిలవడం , మునగడం , అందులో ఈత కొట్టడం సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కి కొత్తేమీ కాదు. గ్యాంగ్ స్టర్ సినిమాల్లో డాన్ లని కమెడియన్ చెయ్యాలి అన్నా హీరోలని చెయ్యాలి అన్న రామూ కే చెల్లింది. రాయలసీమ ఫ్యాక్షన్ అయినా…విజయవాడ రౌడీయిజమైన…ప్రతీ దానికి ఎదో ఒక గొడవ వేస్కోవడం వివాదాలతో సావాసం చెయ్యడం వర్మ కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే వర్మ అంటేనే వివాదం…వివాదం అంటేనే వర్మ అనే పేరుతెచ్చుకున్నారు.
అయితే ,ఇటీవల ఓ షోలో పాల్గొన్న వర్మ…పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తాను రెండు సార్లు జైలు శిక్ష అనుభవించానని తెలిపాడు. ఒకసారి విజయవాడలో ఐదుగురిని కొట్టినందుకు జైల్లో ఉన్నానని…ఇంకోసారి పంజాగుట్ట జైలులో లాకప్‌లో ఉన్నానని తెలిపాడు. అమీర్ పేటలో ఓ వీడియో క్యాసెట్ షాపు రన్ చేస్తున్నప్పుడు అమితాబ్ సినిమా పైరసీ చేసి అమ్ముతున్నందుకు జైల్లో పెట్టారని వెల్లడించాడు. అయితే, జైల్లో పెట్టినందుకు తానేమీ తప్పుగా భావించలేదని….మహాత్మగాంధీ కూడా జైల్లో ఉన్నారని తెలిపారు.
తనకు అసలు కోపమే రాదన్న వర్మ….పవన్ అభిమానులతో ఆ కోరిక తీరిపోయిందన్నారు. పవన్‌ను పొగుడుతు ట్వీట్ చేస్తే…దానిని అభిమానులు తప్పుగా అర్ధం చేసుకున్నారని అందుకే కోపమొచ్చిందని తెలిపాడు. నేను పవన్ ఫ్యాన్‌ని కానీ ఇండస్ట్రీలో బాలయ్య అంటే అభిమానిస్తానని తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు. నేను ఎప్పుడు అన్నమాటని నిలబెట్టుకోనని…అందులో భాగంగానే తెలుగులో ఇదే లాస్ట్ సినిమా అని చెప్పినమాటన్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవితో సినిమా మధ్యలో ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించగా…అందుకు కారణాలు సంవత్సరం చెప్పిన అయిపోవంటూ సెటైర్ వేశాడు. ఇండస్ట్రీలో శ్రీదేవి,జయసుధ,ఉర్మిళ కాకుండా ఎవరు ఇష్టమని అడుగగా రాజకీయాల్లో ప్రియాంక గాంధీ,దావూద్ ఇబ్రహీం కూతురు అంటే ఇష్టమని తెలిపాడు. పెళ్లికి చావుకు తేడా లేదన్నారు. పెళ్లితో ఫ్రీడమ్ పోతుందని…చావుతో మనిసే పోతాడని వర్మ తెలిపాడు. తనకు పెళ్లితోనే జ్ఞానోదయమైందని వెల్లడించాడు. జయలలిత స్నేహితురాలు శశికళపై సినిమా తీస్తున్నానని చెప్పాడు ఆర్జీవీ.
తనకు శ్రీదేవి, జయసుధ రెండు కళ్లు అని తెలిపాడు. అమ్మ,నాన్న పుట్టిస్తే….ఆనందాన్ని మాత్రం వేరేవారిచ్చారని తెలిపాడు. తన చివరి కోరిక ఏంటని ఓ అభిమాని అడగగా… వచ్చే జన్మలో బోనికపూర్‌గా పుట్టించమని కోరుకుంటానని తెలిపాడు. తనకు భయపెట్టడం అంటే ఇష్టమని….అందుకే ధియేటర్లలో భయపెడతానని తెలిపాడు. పూరి జగన్…మంచి ప్రెండని తెలిపాడు.ఇక చివరగా అమ్మాయిలంటే పిచ్చని..వొడ్కా అంటే ప్రాణమన్న వర్మ….ఆర్జీవీ సినిమాలు అంటే ప్రేక్షకుల కర్మ అంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నాడు.