పవన్ అభిమానిగా చాలా బాధ‌ప‌డుతున్నా..

219
RGV tweet abou on PK fans..
- Advertisement -

ఎప్పుడు ఎదో ఒక సంచనలంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉండే సంచలన దర్శకుడు రామ్ గోపల్ వర్మ తాజాగా మరో ట్విట్‌తో వార్తల్లో నిలిచాడు. గతంలో పవన్ కల్యాణ్ వర్మ మధ్య జరిగిన వార్ గురించి తెలిసిందే. ఆ మధ్య జరిగిన వివాదంలో ఇక పవన్‌కు గురించి కానీ మెగా ఫ్యామిలీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆయన చెప్పడంతో అందరు నిజమే అనుకున్నారు కానీ తీర చూస్తే మరోసారి పవన్ అభిమానులు, జనసేన పార్టీ గురించి వరుస ట్విట్లతో చెలరేగిపోయాడు వర్మ.

RGV tweet abou on PK fans..

నాగార్జున హీరోగా వర్మ డైరెక్షన్‌లో వస్తున్నతాజా చిత్రం ‘ఆఫీసర్’. ఈ సినిమా టీజర్‌కు యూట్యూబ్‌లో 11 వేల డిస్‌లైక్‌లు వ‌చ్చాయి. ఈ నేపధ్యంలో వర్మ ఈ విధంగా ట్విట్ చేస్తూ…`ఆఫీస‌ర్‌` సినిమాకు 11 వేల డిస్‌లైక్‌లు మాత్ర‌మే వ‌చ్చాయి. అంటే ప‌వ‌న్ ఫ్యాన్స్ 11 వేల మందేనా. ప‌వ‌న్ అభిమానిగా నేను చాలా బాధ‌ప‌డుతున్నాను.

11 కోట్ల మంది తెలుగు ప్ర‌జ‌ల్లో 11 వేల మంది మాత్ర‌మే అభిమానులున్నారంటే.. జ‌న‌సేన పార్టీ దీని గురించి చాలా సీరియ‌స్‌గా ఆలోచించాలి. లేక‌పోతే జ‌న‌సేన కూడా `ప్ర‌జారాజ్యం`లా ఓటమి కాక త‌ప్ప‌దం`అంటూ వ‌రుస ట్వీట్ల‌తో హోరెత్తించాడు. ఈ ట్విట్లతో పవన్ అభిమానులు రిట్విట్లు చేస్తున్నారు. ఇలాంటి ట్విట్లతో మళ్లీ ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మరి..!

- Advertisement -