వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ…తాజాగా రజనీపై ప్రశంసలు గుప్పించారు. రజనీకాంత్ ప్రధానమంత్రి అయితే భారత్ అమెరికా స్థాయికి చేరుకుంటుందంటూ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో భారత్ కూడా ఒక దేశం. అదే రజనీకాంత్ ప్రధానమంత్రి అయితే ఇండియా కచ్చితంగా అమెరికా స్థాయికి చేరుతుంది. 2.జీరో నుంచి 200.జీరోకు చేరుతుంది అని ట్వీట్ చేశారు. అంతేకాదు పెళ్లి, చావు ఒకటేనంటూ మరో ఆసక్తికరమైన ట్వీట్‌ను కూడా వర్మ చేశారు. వివాహం, కర్మకాండలంటే నాకు ఇష్టం ఉండదు. ఒకటి స్వేచ్ఛను కోల్పోయేందుకు చేస్తే.. మరొకటి దేహం చనిపోయింనందుకు చేస్తారు అంటూ ట్వీటారు.
ఇటీవల ‘గాడ్.. సెక్స్.. అండ్ ట్రూత్’ పేరుతో సినిమాను తీసి సంచలనం సృష్టించిన వర్మ…తాజాగా రజనీ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.