‘తులసి తీర్థం’తో వస్తున్న వర్మ..

112
rgv
- Advertisement -

రాం గోపాల్ వర్మ ఇయన ఏది మాట్లాడినా.. ఏ సినిమా తీసినా అది సంచలనమే.. సినిమా మొదలైనప్పటి నుంది విడుదలైయ్యే వరకు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. అయితే వర్మ ఇప్పటివరకు తన సొంత కథలతో మాత్రమే సినిమాలు తీస్తూ… నిత్యం వివాదాల్లో ఉండే వాడు. కానీ తన కెరీర్‌లో మొదటిసారి వేరే రచయిత సమకూర్చిన కథతో సినిమా తీయబోతున్నాడు. ఆ చిత్రం పేరు ‘తులసి తీర్థం’. ఎప్పుడూ తన చిత్రాలకు విచిత్రమైన టైటిల్స్ పెట్టే వర్మ.. ఇప్పుడు ఇలాంటి టైటిల్‌తో సినిమా చేస్తున్నాడంటే నిజంగా షాకింగ్‌గానే అనిపిస్తోంది. కాకపోతే నమ్మాలి. ఎందుకంటే పేరుకే ఇది ‘తులసి తీర్థం’. లోపలంతా వర్మ మార్కే ఉంటుందట.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా వదిలారు. భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ రేర్ కాంబినేషన్ చిత్రాన్ని అత్యాధునిక గ్రాఫిక్స్‌తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ హారర్ థ్రిల్లర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు.

ఇక ‘తులసి తీర్థం’ కథ విషయానికి వస్తే.. ‘తులసీదళం’ నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ రైటర్‌గా నీరాజనాలందుకుని.. మానసిక వికాస రచనలతో వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేస్తున్న రచనా సంచలనం యండమూరి వీరేంద్రనాథ్‌ ఈ ‘తులసి తీర్ధం’ కథను తీర్చిదిద్దారు. కాన్సెప్ట్ పరంగా ఇది ‘తులసిదళం’కు సీక్వెల్ కానుంది. మరి ఈ కథతో వర్మ ఏలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి..!

- Advertisement -