‘భీమ్లా నాయక్’ టీజర్ వచ్చేస్తోంది..

14
Bheemla Nayak

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కులున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు ఈ మూవీ రీమేక్‌. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా.. అతడిని ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఈ నేపథ్యంలో ఈ మూవీ నుండి టీజర్‌ వదిలేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. డిసెంబర్‌లో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ – రానా పాత్రలకి సంబంధించిన హైలైట్ సీన్స్ పై ఈ టీజర్‌ను కట్ చేయనున్నట్టు చెబుతున్నారు. సినిమాపై ఆసక్తిని రేకేతించేదిలా ఈ టీజర్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.