ఫస్ట్ లుక్: ‘ఆర్జీవీ మిస్సింగ్’

214
rgv

రామ్ గోపాల్ వర్మ తన సినిమా ‘ఆర్జీవీ మిస్సింగ్’ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా ఇదని వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు తాను మిస్ కావడానికి కారణమైన అనుమానితుల జాబితాను కూడా వెల్లడించారు. పవర్ ఫుల్ స్టార్ ప్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు అనుమానితులని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్టుగా పోస్టర్ ఉంది. రేపు సాయంత్రం 5 గంటలకు సెకండ్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తానని తెలిపారు.