మొక్కలు నాటిన మహాదేవపూర్ ఎఫ్ఆర్ఓ రేణుక..

161
mahadevpur fro

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా ముందు కొనసాగుతుంది. ఇందులో భాగంగా మహాదేవపూర్ డిఎఫ్ఓ వజ్రా రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మహాదేవపూర్ ఎఫ్ఆర్ఓ రేణుక నేడు మహాదేవపూర్ ఫారెస్ట్ ఆఫీసులో మొక్కలు నాటారు.

వాతావరణం పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి నా బాధ్యతగా నేను ఈరోజు మొక్కలు నాటాను అని.. ప్రతిఒక్కరు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఇలానే కొనసాగాలని సంతోష్, నరేష్, సుమన్ ఏఆర్ఓ భూపాలపల్లి గార్లకు ఛాలెంజ్ చేశారు.