వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి ఈటెల సమగ్ర సమీక్ష..

223

వైద్య ఆరోగ్య శాఖను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు వెంగళ్ రావు నగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నాధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రీజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయుష్ ఇంచార్జ్ డైరెక్టర్ ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు, టీఎస్‌ఎంఐడీసీ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్,డీఎంఈ,టీవీవీపీ,డీపీహెచ్‌, ఆయుర్వేద, హోమియో, యునానీ, యోగ అండ్‌ నాచురోపతి విభాగాల అధికారులు హాజరయ్యారు.

ఆయుష్ డిపార్ట్మెంట్ :
భారతీయ ప్రాచీన వైద్య విధానంకు పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోన సమయంలో ప్రతి ఇల్లు ఒక ఆయుర్వేద సెంటర్‌గా మారిందని అన్నారు. వ్యాధి నిరోదక శక్తి పెంచుతున్న ఆయుష్ మందులను మరింత అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తెలిపారు. ఆయుష్ డిపార్ట్మెంట్ మీద గతంలో సుధీర్ఘ సమీక్షలు నిర్వహించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలని అమలు చేయకపోవడంపై మంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లోపతీ లాగానే ఆయుష్‌లో ఉన్న విభాగాల్లో విద్యార్ధులు ఐదు సంవత్సరాలపాటు చదువు తున్నప్పుడు వారికి గుర్తింపు, గౌరవం దక్కేలా చూడాల్సిన భాద్యత మన మీద ఉంది అన్నారు. ఆయుర్వేద, యునానీ, హోమియో, నాచురోపతి మరియు యోగా అన్ని విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్ట్ ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఆయుష్ డిస్పెన్సరీ సెంటర్స్ అన్నిటినీ వెలనెస్ సెంటర్ లుగా మార్చాలని ఆదేశించారు. ప్రస్తుతం 440 ప్రభుత్వ డిస్పెన్సరీలు, 394 ఎన్‌ఆర్‌హెచ్ఎం డిస్పెషరీస్ పని చేస్తున్నాయి. తక్కువ పేషంట్లు వస్తున్న డిస్పెన్సరీస్ అన్నిటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని తెలిపారు. పీహెచ్‌సీ లోనే ఆయుష్ విభాగాలు కూడా ఉండేలా చూడాలని కోరారు. ఆయుష్ అభివృద్దికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి నివేదికను తయారుచేయాలని సూచించారు.

తెలంగాణ వైద్య విధాన పరిషద్:
వైద్య విధాన పరిషత్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని మంత్రి ఈటెల ఆదేశించారు. రిక్రుట్మెంట్ చేయడానికి ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరించాలని మంత్రి సూచించారు. ప్రమోషన్ చానల్ లో సమస్యలు లేకుండా నిభందనలు తయారు చేయాలని ఆదేశాలు. ప్రతి 6 నెలలకు ఒక సారి ఖాళీ పోస్ట్స్ లను మెడికల్ బోర్డు ద్వారా నియామకాలు చేయడానికి ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పని చేయని వారి మీద చర్యలు తీసుకొనేవిధంగా నిభందనలు మార్చాలని ఆదేశాలిచ్చారు. పబ్లిక్ హెల్త్ నుండి వైద్య విధాన పరిషత్ కి మార్చబడిన 15 హాస్పిటల్స్ లో ఇప్పటికే కొన్ని హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి అయ్యాయి వాటిల్లో అవసరం అయిన డాక్టర్, సిబ్బందిని నియమించాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి హాస్పిటల్ కి అంబులెన్స్ ఉండాలి, సిటి స్కాన్, పూర్తి స్థాయి ల్యాబ్ లు ఏర్పాటు చేయాలి, అవసరం ఉన్న చోట్ల అన్ని వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలి. వాటికి ఆన్యువల్ మెయింటెనెన్స్ తప్పని సరిగా ఉండాలి అని మంత్రి సూచించారు. వైద్యం అందించడం ఎంత ముఖ్యమో రోగులతో ఆప్యాయంగా మాట్లాడడం కూడా అంతే ముఖ్యం. ఏం చికిత్స అందిస్తున్నామో ఎప్పటికప్పుడు రోగికి, వారి బందువులకు అందించాలి అందుకోసం పేషంట్ కౌన్సిలర్స్ ను ఏర్పాటు చేయాలి అని మంత్రి సూచించారు. ప్రతి హాస్పిటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసి వచ్చిన పేషంట్ ని గైడ్ చేయాలి అని మంత్రి తెలిపారు.

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ :
సబ్ సెంటర్ నుండి పీహెచ్‌సీ వరకు అన్నీ ఖాళీల వివరాలు అందజేయాలని మంత్రి కోరారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇన్ సర్వీస్ పీజీ చేసిన తరువాత వారి సేవలు వైద్య విధాన పరిషత్ , డీఎంఈ ఆసుపత్రుల్లో వినియోగించుకోనెల చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ పై సమీక్షించిన మంత్రి.. మందుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని ఆదేశించారు. క్వాలిటీ టెస్ట్ చేయడానికి అవసరం అయిన ల్యాబ్, సిబ్బంది ని పెంచాలని సూచించారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా మందుల ధరలు ఉండేలా చూసుకోవాలని కోరారు. మందుల వివరాలు ఆన్లైన్ లో ఉండేలా చూడాలని.. ప్రతి టాబ్లెట్ కి లెక్క ఉండాలని సూచించారు.

సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేశారు:
డాక్టర్ లు , సిబ్బంది సమస్యలు ఎప్పటికప్పుడు పరిస్కరించాలని సూచించారు. హాస్పిటల్ కి పేషంట్ నే విఐపి అనే విషయం మరచిపోవద్దు అన్నారు. ప్రతి హాస్పిటల్ కి అంబులెన్స్ ఉండాలి. రిసెప్షన్ ఉండాలి. ప్రతి ఆసుపత్రికి మిషన్ భగీరథ కనెక్షన్ ఉండాలి. కరెంటు కనెక్షన్ లు సరిగా ఉండేలా చూడాలి. అవసరం ఉన్న దగ్గర జెనరేటర్ ఏర్పాటు చేయాలి. 108 , 104 , 102 వాహనాలు ఎక్కడ అవసరం ఉందో లెక్క తీయండి. ఏ ఒక్క హాస్పిటల్ లో , ఆఫీసు లో పనికి రాని వస్తువులు,చెత్త ఉండవద్దు. రాష్ట్రం లో ఉన్న అన్ని హాస్పిటల్ లు పరిశుబ్రంగా ఉండేలా చూడాలి. అన్నిటికీ రంగులు వేయండి అని ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఈటెల. 90 శాతం మంది పేషంట్లకు ప్రాధమిక ఆరోగ్య ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల లోనే చికిత్స అందిచాలి. పెద్ద జబ్బులు ఉన్న వారు మాత్రమే టెర్శరీ కేర్ హాస్పిటల్స్ కి, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి వచ్చేలా చూడాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ 365 రోజులు పనిచేయాల్సిన డిపార్ట్మెంట్. ప్రతి నెల సిబ్బందికి సకాలంలో జీతాలు అందేలా చూడాలని సూచించారు.

వైద్య ఆరోగ్యం అనేది రాష్ట్రం ప్రభుత్వ అదీనంలో ఉంది, దేశానికి అంతా ఒకే పాలసీ తయారు చేసి మా మీద రుద్ద వద్దు అని గతంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి చెప్పినం. మా రాష్ట్ర ప్రజలకు ఏం అవసరమో మాకు తెలుసు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం ఎంతో ఉపయోగపడింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఫ్లోరైడ్ సమస్య దూరం అయ్యింది. నీటి ద్వారా సంక్రమించే వ్యాదులన్నీటినీ అరికట్టగలిగినం. కళ్యాణ లక్ష్మీ పథకం వల్ల చైల్డ్ మేరేజ్ లు తగ్గిపోయాయి, తద్వారా చిన్న వయసులో గర్భం దాల్చడం, ఆనారోగ్యంతో పిల్లలు పుట్టడం తగ్గిపోయింది అని మంత్రి తెలిపారు. మిషన్ కాకతీయ, హరిత హారం ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో పరోక్షంగా సాయపడ్డాయని మంత్రి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ గ్రామాల్లో పంచాయతీ రాజ్ శాఖతో, పట్టణాలలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో సమన్వయంతో పని చేయాలని సూచించారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుబ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్‌.