ఆర్జీవీ…’ఐస్‌క్రీమ్ 3′

187
rgv
- Advertisement -

కాంట్రవర్సీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆర్జీవీ. వైవిధ్యమైన హారర్ మూవీసే కాదు సమాజంలో వార్తలుగా నిలిచే సంఘటనలపై సినిమాలు తీసి వివాదాలకు అడ్రస్‌గా మారే ఆర్జీవీ తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్‌ చేశారు. అది ఇప్పటికే తాను తెరకెక్కించిన హార్రర్ మూవీ ఐస్‌ క్రీమ్‌కి సీక్వెల్‌. ఇప్పటికే ఐస్‌క్రీమ్ 2 ప్రేక్షకుల ముందుకురాగా తాజాగా ఐసీక్రీమ్‌ 3ని అనౌన్స్‌చేశారు వర్మ.

ఐస్ క్రీమ్ 1, 2లను నిర్మించిన సీనియర్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మూడవ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా నటీనటులు,ఇత వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 2014లో వచ్చిన “ఐస్ క్రీమ్” తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించగా భారీ లాభాలను సాధించి పెట్టింది. అయితే రెండో పార్ట్ “ఐస్ క్రీమ్-2”కి మాత్రం భిన్నమైన టాక్ వచ్చింది.

కరోనా టైంలో ఆర్జీవీ వరుసగా ఓటిటి వేదికపై సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో నేక్డ్, థ్రిల్లర్, కరోనా వంటి చిత్రాలుండగా బ్రూస్‌ లీ, మర్డర్ వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

- Advertisement -